ధోనీని టార్గెట్ చేస్తూ హర్భజన్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2020-10-04T15:52:33+05:30
ఐపీఎల్-13లో ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత చెత్త ప్రదర్శన చూపింది. సీఎస్‌కే ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లు ఓటమి పాలయ్యింది. ఐపీఎల్ చరిత్రలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్
దుబాయ్: ఐపీఎల్-13లో ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత చెత్త ప్రదర్శన చూపింది. సీఎస్‌కే ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లు ఓటమి పాలయ్యింది. ఐపీఎల్ చరిత్రలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులనే కాకుండా, తోటి క్రీడాకారులను కూడా నిరాశ పరిచారు. ఈ నేపధ్యంలో ధోనీ తోటి క్రీడాకారుడు హర్భజన్ సింగ్ కూడా మహీ వయసును ప్రస్తావించారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అందరికన్నా ముందుగా ధోనీని టార్గెట్ చేయగా, దీనికి హర్భజన్ మద్దతు పలికారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతూ దిగిన మ్యాచ్‌లో ధోనీ తన ఫిట్‌నెస్ విషయంలో కాస్త తడబడుతూ కనిపించారు.
ఇర్ఫాన్ పఠాన్ ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘కొంతమందికి వయసు అనేది పెరిగే సంఖ్య. అయితే ఇదే అంశం వారిని టీమ్ నుంచి తొలగించేందుకు కారణం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ... ‘ఇర్ఫాన్ పఠాన్... నేను నీ మాటకు 1,00,00,000 శాతం మద్దతు పలుకుతున్నాను’ అని రాశారు. కాగా హర్బజన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేవిగా ఉన్నాయని క్రీడాభిమానులు అంటున్నారు. ఎందుకంటే ఈ స్టార్ స్పిన్నర్ ఐపీఎల్‌లో గత రెండేళ్లుగా ధోనీ సారధ్యంలోని మ్యాచ్‌లలో ఆడారు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో హర్భజన్ ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు.
Updated Date - 2020-10-04T15:52:33+05:30 IST