ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుగ్లీలో ఇంటర్నెట్ సేవల తాత్కాలిక నిలిపివేత

ABN, First Publish Date - 2020-05-13T20:42:09+05:30

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుగ్లీ : పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. చందెన్నగోర్, శ్రీరామ్‌పోర్ సబ్ డివిజన్లలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. కొందరు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి వార్తలను ప్రచారం చేయడం వల్ల ఈ ప్రాంతంలో హింస చెలరేగే అవకాశం ఉందనే కారణంతో యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. 


హుగ్లీ జిల్లా మేజిస్ట్రేట్ యెలుచూరి రత్నాకర రావు బుధవారం మాట్లాడుతూ చందెన్నగోర్, శ్రీరామ్‌పోర్ సబ్ డివిజన్లలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేసినట్లు తెలిపారు. కొందరు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నకిలీ వార్తల ప్రచారం వల్ల ఈ ప్రాంతంలో హింస చెలరేగే అవకాశం ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


చందెన్నగోర్, శ్రీరామ్‌పోర్ సబ్ డివిజన్లలో కొందరు దుండగులు సామాజిక మాధ్యమాలను దుర్వినియోగపరుస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా వదంతులను ప్రచారం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. 



Updated Date - 2020-05-13T20:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising