ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టులోగా అంతర్జాతీయ ప్రయాణాలు

ABN, First Publish Date - 2020-05-24T07:33:49+05:30

ఆగస్టులోగా అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమవుతాయని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి వెల్లడించారు. శనివారం ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తాం
  • కరోనా టెస్ట్‌ చేయించుకోవాలి: హర్దీ్‌పసింగ్‌

న్యూఢిల్లీ, మే 23: ఆగస్టులోగా అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమవుతాయని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి వెల్లడించారు. శనివారం ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. ‘‘ఈనెల 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ విమాన సేవలు ఆగస్టులో ప్రారంభమవుతాయా? సెప్టెంబరులోనా? అని అడిగితే.. కచ్చితంగా ఆలోపే అంటాను’’ అని ఆయన వివరించారు. దేశీయ విమాన ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం తప్పనిసరి కాదంటూనే మెలికపెట్టారు. ‘‘ఆరోగ్యసేతును డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రయాణికులు అందులో కరోనా టెస్ట్‌లో పాసైతే చాలు. అది తప్పనిసరి కాదు. కాకుంటే ఆ యాప్‌ వాడనివారు విమానాశ్రయాల్లో సెల్ఫ్‌డిక్లరేషన్‌ ఇవ్వాలి. ప్రయాణానికి 2, 3 రోజుల ముందే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వాటి ఫలితాలను డిక్లరేషన్‌తో జతచేయాలి’’ అన్నారు. దేశీయ విమాన ప్రయాణాలపై కొన్నిరాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, వాటన్నింటినీ కేం ద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. ‘‘రాష్ట్రాల ఆందోళనను సీనియర్‌ మంత్రులకు చెప్పాలన్నాం. ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు’’ అన్నారు. ఆరోగ్యంగా ఉన్న వృద్ధులు కూడా దేశీయ ప్రయాణాలు చేయవచ్చన్నారు. ఇంతకుముందు పౌర విమానయాన శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో వృద్ధులు, 10 ఏళ్లలోపు చిన్నారులకు విమాన ప్రయాణాలకు అనుమతి లేదని పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-05-24T07:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising