వాయిదాలు చెల్లించలేదా? ఇళ్లు, స్థలం కేటాయింపు రద్దు
ABN, First Publish Date - 2020-12-29T13:46:46+05:30
బకాయిలు నిర్ణీత గడువు లోపు చెల్లించని వారికి ఇళ్లు, స్థలం కేటాయింపు రద్దు చేస్తామని హౌసింగ్ బోర్డు హెచ్చరించింది. రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు వివిధ ప్రాంతాల్లో నివాస పథకాలు అమలుచేస్తుంది.
చెన్నై : బకాయిలు నిర్ణీత గడువు లోపు చెల్లించని వారికి ఇళ్లు, స్థలం కేటాయింపు రద్దు చేస్తామని హౌసింగ్ బోర్డు హెచ్చరించింది. రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు వివిధ ప్రాంతాల్లో నివాస పథకాలు అమలుచేస్తుంది. ఇళ్లు, స్థలాలు పొందిన వారిలో పలువురు బకాయిలు చెల్లించలేదు. జరిమానాతో బకాయిలు చెల్లించేందుకు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. దీంతో వారి పేర్లు, వివరాలను బహిరంగంగా వెల్లడిస్తామని, అంతేకాకుండా వారి ఇళ్లు, స్థలాల కేటాయింపు రద్దు చేస్తామని హౌసింగ్ బోర్డు పేర్కొంది.
Updated Date - 2020-12-29T13:46:46+05:30 IST