ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పెళ్లాం లాంటిది: ఇండోనేషియా మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-05-29T22:00:31+05:30

మంత్రి మహ్మద్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేచింది. మహిళా సంఘాలు, నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ‘‘మంత్రి చేసిన వ్యాఖ్యలు కోవిడ్-19 నివారణపై ప్రభుత్వం యొక్క చిత్తశుద్దిని మాత్రమే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జకర్తా: కరోనా వైరస్ తిరుగుబాటు వ్యక్తిత్వం కలిగిన భార్య లాంటిదని ఇండోనేషియాకు చెందిన మంత్రి మహ్మద్ మహ్ఫుద్ ఎండీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం సడలించింది. అయితే లాక్‌డౌన్ సడలింపుపై ప్రజల్లో భయాన్ని తొలగిస్తూ వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే క్రమంలో ఆయన ఈ వ్యాక్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు సహా సోషల్ మీడియా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసింది.


‘‘మనం లాక్‌డౌన్‌ను ఎత్తేయబోతున్నాం. అయితే మన ఆరోగ్యం పట్ల అన్ని శ్రద్ధలు తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది జరిగిన ఒక రోజుకు నా సహోద్యోగి నుంచి ఒక మీమ్ వచ్చింది. ‘కరోనా మీ భార్య లాంటిది. మొదట్లో మీరు ఆమెన్ కంట్రోల్ చేయాలని అనుకుంటారు. అయితే కంట్రోల్ చేయలేరని తర్వాత తెలుసుకుంటారు. ఇక చేసేదేమీ లేక సహజీవనం ప్రారంభిస్తారు’ అని అందులో ఉంది. నిజమే ప్రస్తుత పరిస్థితి అలాంటిదే’’ అని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఓ కర్యాక్రమంలో మంత్రి మహ్మద్ అన్నారు.


మంత్రి మహ్మద్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేచింది. మహిళా సంఘాలు, నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ‘‘మంత్రి చేసిన వ్యాఖ్యలు కోవిడ్-19 నివారణపై ప్రభుత్వం యొక్క చిత్తశుద్దిని మాత్రమే కాకుండా సదరు మంత్రి యొక్క సెక్సీయెస్ట్ ఆలోచనా విధానాన్ని ప్రతిభింబిస్తోంది’’ అని వుమెన్స్ సాలిడేరిటీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దిండా నిసా యురా అన్నారు.


ఇండోనేషియాలో 24,000 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1,496 మంది కరోనా వల్ల మృతి చెందారు. కాగా కరోనా టెస్టులు తక్కువగా చేసిన దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ప్రపంచ సగటు కంటే కూడా ఇండోనేషియాల్లో చాలా తక్కువ టెస్టులు చేశారు.

Updated Date - 2020-05-29T22:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising