ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లాక్‌డౌన్: భారత్‌లో రెండే అత్యంత కలుషిత నగరాలు

ABN, First Publish Date - 2020-04-09T01:05:52+05:30

కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపు మేరకు మార్చి 23వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపు మేరకు మార్చి 23వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రైలు, విమానాలతో పాటు ఇతర వాహనాల వాడకం కూడా తగ్గిపోయింది. అంతేకాక, ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా కాలుష్యం శాతం కూడా తగ్గిపోయింది.


గత ఏడాది(2019) ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 20 అత్యంత కలుషిత నగరాల్లో 14 నగరాలు భారతదేశానికి చెందినవే. అయితే ఏప్రిల్ 7వ తేదీన వచ్చిన నివేదిక ప్రకారం.. ఈ సంఖ్య కేవలం రెండుకు పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ముంబై, కోల్‌కతా మాత్రమే అత్యంత కలుషిత నగరాలుగా నిలిచాయి. అయితే లాక్‌డౌన్ అమలు ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపించినా.. కాలుష్యాన్ని మనం అదుపు చేయవచ్చనే విషయాన్ని రుజువు చేసిందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. 


కేంద్ర కాలుష్య నివారణ శాఖ పర్యవేక్షిస్తున్న 103 నగరాల్లో లాక్‌డౌన్ సమయంలో 90శాతం కాలుష్యం తగ్గినట్లు నిర్ధారణ జరిగింది. గాలిలో కాలుష్య శాతం తగ్గడం వల్ల నిమోనియా వంటి వ్యాధులు సోకే అవకాశాలు తగ్గుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతీ ఏడా దాదాపు ఏడు మిలియన్ల మంది కలుషిత గాలి పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దీంతో ఆర్థిక వ్యవస్థకంటే కూడా కలుష్యాన్ని తగ్గించడం ఎంతో ముఖ్యమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. 


‘‘లాక్‌డౌన్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ దేశమూ దీన్ని కోరుకోదు. కానీ, లాక్‌డౌన్‌ విధించక ముందు పరిస్థితులతో పోలిస్తే.. ప్రస్తుతం గాలి ఎంతో స్వచ్ఛంగా మారింది. అయితే ఆర్థిక సంక్షోభం ఉంది.. కానీ లాక్‌డౌన్ కారణంగా గాలి స్వచ్ఛంగా మారితే.. జీవితాలు బాగుంటాయి’’ అని డాక్టర్ పంకజ్ సాయల్ అన్నారు. 

Updated Date - 2020-04-09T01:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising