ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో ప్రతిరోజూ 15 వేల కొత్త కరోనా కేసులు: చైనా శాస్త్రవేత్తల హెచ్చరిక

ABN, First Publish Date - 2020-06-03T22:33:30+05:30

ప్రస్తుతం దేశంలో ప్రతిరోజు దాదాపు 8 వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ సంఖ్య మరింత పెరిగి, 15 వేల మార్కును కూడా దాటుతుందని చైనా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: ప్రస్తుతం దేశంలో ప్రతిరోజు దాదాపు 8 వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ సంఖ్య మరింత పెరిగి, 15 వేల మార్కును కూడా దాటుతుందని చైనా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జూన్ నెలలో భారత్‌లో ప్రతిరోజూ నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరిగి 15 తారీఖు నాటికి 15 వేల మార్కును చేరుకుటుందని వారంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి సంబంధించి వారి అంచనాలో భాగంగా ఇండియా పరిస్థితిపై ఇలా ఉంటుందని చెప్పుకొచ్చారు.


చైనాలోని లాంగ్జో యూనివర్శిటీ పరిశోధకులు ఈ స్టాటిస్టికల్(గణాంకశాస్త్రం) మోడల్‌ను గత వారం విడుదల చేశారు. ఇందులోని అంచనాలు ఎప్పటికప్పుడు తాజా పరుస్తామని తెలిపారు. ఈ మోడల్ ద్వారా వ్యాధి వ్యాప్తిని అంచనా వేసేందుకు వివిధ దేశాల్లోని కేసులు సంఖ్య, జనసాంద్రత, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు.


వారి మోడల్ ప్రకారం.. జూన్ 2న భారత్‌లో 9,291 కేసులు నమోదవుతాయని ప్రకటించగా.. 8,909 కేసులు వెలుగు చూశాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనర్థం.. తమ అంచనాలు వాస్తవ సంఖ్య దగ్గరా ఉన్నాయని వారు స్పష్టం.


ఇక బుధవారం నుంచి రాబోయే నాలుగు రోజుల్లో కేసులు సంఖ్య వరుసగా 9676, 10078, 10498, 10936గా ఉంటుందని అక్కడి పరిశోధకులు అంచనా వేస్తున్నారు. జూన్ 15 కల్లా భారత్‌లో నమోదయ్యే రోజు వారి కేసుల సంఖ్య 15 వేలు దాటుతుందని స్పష్టం చేస్తున్నారు. అదే అమెరికాలో అయితే రోజువారీ కేసుల సంఖ్య 30 వేలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. భారత్ విషయంలో వాతావరణం కంటే..అధిక జనసాంద్రతే వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని అన్నారు. లాక్ డౌన్ సడలించే కొద్ది కేసుల సంఖ్య తీవ్రమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.  

Updated Date - 2020-06-03T22:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising