ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌ పటంలో భారత భూభాగాలు

ABN, First Publish Date - 2020-09-16T07:43:28+05:30

కశ్మీర్‌, జునాగఢ్‌లను తన దేశంలో అంతర్భాగంగా పేర్కొంటూ పాకిస్థాన్‌ రూపొందించిన పటంపై నిరసన వ్యక్తం చేస్తూ జాతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎస్‌సీవో సమావేశం నుంచి దోవల్‌ వాకౌట్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: కశ్మీర్‌, జునాగఢ్‌లను తన దేశంలో అంతర్భాగంగా పేర్కొంటూ పాకిస్థాన్‌ రూపొందించిన పటంపై నిరసన వ్యక్తం చేస్తూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌.. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాల సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. రష్యా అధ్యక్షతన మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా ఎస్‌సీవో సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌ ప్రతినిధి కూడా పాల్గొన్నారు.


కశ్మీర్‌, జునాగఢ్‌లను తమ దేశంలో అంతర్భాగంగా చూపుతూ రూపొందించిన పటం ముందు ఆయన కూర్చున్నారు. ఈ   విషయాన్ని గమనించిన ఢోబాల్‌.. ఆతిథేయి రష్యాను సంప్రదించిన అనంతరం సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు. 


Updated Date - 2020-09-16T07:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising