ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపాయి పైపైకి...

ABN, First Publish Date - 2020-07-04T00:26:33+05:30

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలపడింది. మరోవైపు ముడి చమురు ధరలు కూడా దిగొచ్చాయి. ఇక... సానుకూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా మార్కెట్ శుక్రవారం లాభాలతో దూసుకెళ్లింది. సూచీలు లాభపడటం ఇది వరుసగా మూడవ రోజు కావడం గమనార్హం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 267 పాయింట్ల వరకు ఎగసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలపడింది. మరోవైపు ముడి చమురు ధరలు కూడా దిగొచ్చాయి. ఇక... సానుకూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా మార్కెట్ శుక్రవారం లాభాలతో దూసుకెళ్లింది. సూచీలు లాభపడటం ఇది వరుసగా మూడవ రోజు కావడం గమనార్హం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 267 పాయింట్ల వరకు ఎగసింది.


36,110 పాయింట్ల పైకి చేరింది. నిఫ్టీ కూడా 10,631 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఇక ఇతర వివరాలిలా ఉన్నాయి... నిఫ్టీ 50 లో ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటొకార్ప్, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఐషర్ మోటార్స్ 3 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.


ఇవి ఒక  శాతానికి పైగా పడిపోయాయి.  మరోవైపు నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ కూడా మిశ్రమంగానే ముగిసాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. కాగా... అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభపడింది. 37 పైసలు లాభంతో 74.64 వద్ద, అంటే... మూడు నెలల గరిష్ట స్థాయి వద్ద నిలకడగా ఉంది. 


Updated Date - 2020-07-04T00:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising