భారత్‌లో డ్రోన్ల దాడులకు ఇక చెక్
ABN, First Publish Date - 2020-12-11T08:16:55+05:30
డ్రోన్లను నేల కూల్చే అధునాతన వ్యవస్థల కొనుగోలు కోసం ఇజ్రాయెల్‌కు చెందిన స్మార్ట్ షూటర్ సంస్థతో భారత
‘సిస్టమ్స్’ కొనుగోలుకు ఇజ్రాయెల్ సంస్థతో నేవీ ఒప్పందం
న్యూఢిల్లీ, డిసెంబరు 10: డ్రోన్లను నేల కూల్చే అధునాతన వ్యవస్థల కొనుగోలు కోసం ఇజ్రాయెల్‌కు చెందిన స్మార్ట్ షూటర్ సంస్థతో భారత నౌకాదళం ఒప్పందం చేసుకుంది. శత్రు దేశాలు డ్రోన్ల ద్వారా దాడులు జరిపితే.. ఆ డ్రోన్లను కచ్చితత్వంతో, వేగంగా ధ్వంసం చేయగల సామర్థ్యం స్మార్ట్ షూటర్ అభివృద్ధి చేసిన ‘స్మాష్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్’కు ఉంటాయి. వాటి కొనుగోలుకు భారత నౌకాదళంఒప్పందం చేసుకుందని స్మార్ట్ షూటర్ సంస్థ తెలిపింది. అంతేగాక, భారత ఆర్మీ కూడా ‘యాంటీ డ్రోన్ వ్యవస్థ’లను కొనుగోలు చేయడానికి స్మార్ట్ షూటర్ సంస్థతో చర్చలు జరుపుతోంది. డోన్లను ధ్వంసం చేసే విషయంలో భారత సామర్థ్యం ‘స్మాష్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్’ ద్వారా మరింత పెరగనుంది.
Updated Date - 2020-12-11T08:16:55+05:30 IST