ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పాకిస్థాన్‌లో భారతీయుల సంక్షేమంపై పర్యవేక్షిస్తున్నాం’

ABN, First Publish Date - 2020-03-26T20:05:22+05:30

నోవల్ కరోనా వైరస్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని భారతీయుల భద్రత, సంక్షేమంపై పర్యవేక్షిస్తున్నట్లు ఆ దేశంలోని భారత ఎంబసీ గురువారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : నోవల్ కరోనా వైరస్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని భారతీయుల భద్రత, సంక్షేమంపై  పర్యవేక్షిస్తున్నట్లు ఆ దేశంలోని భారత ఎంబసీ గురువారం ప్రకటించింది. 


పాకిస్థాన్‌లోని భారతీయులకు భరోసా ఇస్తూ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని తెలిపింది. ఏదైనా సహాయం అవసరమైతే 030 28514549 నెంబరుకు ఫోన్ చేసి, తమను సంప్రదించవచ్చునని తెలిపింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు పాటిస్తూ, సురక్షితంగా ఉండాలని కోరింది. పాకిస్థాన్‌లోని అందరు భారతీయుల భద్రత, సంక్షేమాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. 


పాకిస్థాన్‌లో ఈ వైరస్ బాధితుల సంఖ్య 1,098కి చేరుకుంది. ఆగ్నేయ రాష్ట్రమైన సింధ్‌లో 413 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు ఈ వైరస్ బాధితులు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 


పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో 323, బలూచిస్థాన్‌లో 131, ఇస్లామాబాద్‌లో 25, ఖైబర్ పష్తూన్‌లో 121 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2020-03-26T20:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising