ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిట్టి చేతుల పెద్ద సాయం!

ABN, First Publish Date - 2020-04-25T07:55:12+05:30

ఆమె వయసు నిండా 15 కూడా ఉండదేమో. అంత చిన్న వయసులోనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి వందలాది మందికి అండ గా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది అమెరికాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పిల్లలు, వృద్ధుల్లో ఒంటరితనం పోగొట్టేందుకు అమెరికాలో భారత సంతతి బాలిక కృషి


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 24: ఆమె వయసు నిండా 15 కూడా ఉండదేమో. అంత చిన్న వయసులోనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి వందలాది మందికి అండ గా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది అమెరికాలోని భారతసంతతి బాలిక హీటా గుప్తా. ఇక్కడి నర్సింగ్‌ హోమ్‌లలో ఉంటున్న ఎంతోమంది వృద్ధులు, చిన్నారులు లాక్‌డౌన్‌ కారణంగా తమ కుటుంబసభ్యులను కలిసే అవకాశం లేక ఒంటరితనంతో పోరాటం చేస్తున్నారు. ఆ బాధ భరించలేక వారిలో చాలామందిలో ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారని ఇటీవల ఒక సర్వే వెల్లడించడంతో, హీటా గుప్తా వాళ్ల కోసం ఏదైనా చేయాలని భావించింది.


తన స్వచ్ఛంద సంస్థ ‘బ్రైటెనింగ్‌ ఎ డే’ ద్వారా వారికి రంగుల పెన్సిళ్లు, కలరింగ్‌ పుస్తకాలు, వివిధ రకాల పజిల్స్‌ను బహుమతులుగా చేసి పంపడం ప్రారంభించింది. ఒంటరిగా కాలం గడిపే వృద్ధులకు ఉపశమనం కలిగించేందుకే ఇలా చేస్తున్నానని చెబుతోంది హీటా. ఆమె ఇప్పటికే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సుమారు 2700మంది పిల్లలు, వృద్ధులకు బహుమతులు పంపించడం గమనార్హం. భారత్‌లోని ఎన్నో అనాథాశ్రమాలకూ హీటా వివిధ రకాలుగా తన సహాయాన్ని అందిస్తోంది. 

Updated Date - 2020-04-25T07:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising