ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమ్మూ-కశ్మీరులో కోవిడ్ కిట్లు పంపిణీ చేసిన భారత సైన్యం

ABN, First Publish Date - 2020-08-21T03:31:19+05:30

జమ్మూ-కశ్మీరులోని వివిధ ప్రాంతాల్లో గుజ్జర్లు, బకర్వాల్ ప్రజలకు కోవిడ్ కిట్లను భారత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉధంపూర్ : జమ్మూ-కశ్మీరులోని వివిధ ప్రాంతాల్లో గుజ్జర్లు, బకర్వాల్ ప్రజలకు కోవిడ్ కిట్లను భారత సైన్యం పంపిణీ చేసింది. రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్ఓ) లెఫ్టినెంట్ కల్నల్ అభినవ్ నవనీత్ గురువారం ఈ వివరాలు తెలిపారు. 


రాజౌరీ, రియాసీ జిల్లాల్లోని కొట్రాంక, ఖవాస్, సమోటే, బుధల్, ఛసన, మఖీధార్ ప్రాంతాల్లో గుజ్జర్, బకర్వాల్ ప్రజలకు భారత సైన్యం 350 కోవిడ్ కిట్లు పంపిణీ చేసినట్లు లెఫ్టినెంట్ కల్నల్ అభినవ్ నవనీత్ తెలిపారు. సబ్బులు, ఫేస్ మాస్కులు, శానిటైజర్లు ఈ కిట్లలో ఉన్నట్లు తెలిపారు. 


దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని, అందువల్ల పారిశుద్ధ్యం, ఆరోగ్యం విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటించవలసి ఉందని చెప్పారు. స్థానిక ప్రజలకు ఈ వ్యాధికి సంబంధించిన మార్గదర్శకాలను తెలియజేస్తూ, అవగాహన కల్పించాలన్నారు. 


Updated Date - 2020-08-21T03:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising