ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్ పీఎల్ఏ జనరల్‌తో భారత రాయబారి విక్రమ్ మిస్రీ భేటీ

ABN, First Publish Date - 2020-08-15T02:47:03+05:30

చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రి శుక్రవారం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రి శుక్రవారం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మేజర్ జనరల్ సి గువోవీయితో సమావేశమయ్యారు. తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనపై భారత దేశ వైఖరిని వివరించారు. చైనాలోని ఇండియన్ ఎంబసీ ఈ వివరాలను ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. 


విక్రమ్ మిస్రీ ఈ నెల 12న చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ విదేశీ వ్యవహారాల కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ లియు జియాంచావోతో సమావేశమయ్యారు. 


తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన ప్రతిష్టంభన ఇప్పటికీ తొలగిపోలేదు. భారత భూభాగాల్లో చైనా ఇంకా తిష్ఠవేసుకుని కూర్చుంది. ఒప్పందాల ప్రకారం చైనా దళాలను ఉపసంహరించాలని భారత దేశం కోరుతోంది. అతి త్వరగా చైనా దళాలను ఉపసంహరించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. తూర్పు లడఖ్‌లో మే 5కు పూర్వం ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది. పాంగాంగ్ ట్సో వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ మే 5న తలెత్తిన సంగతి తెలిసిందే. 


పీఎల్ఏ దళాలు గాల్వన్ లోయ, మరికొన్ని ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి వెనుకకు వెళ్ళాయి. కానీ పాంగాంగ్ ట్సో, గోగ్రా, డెప్సాంగ్ ఫింగర్ ఏరియాల నుంచి చైనా దళాలు వెనుకకు వెళ్ళడం లేదు. 


ఫింగర్ 4, 8 ప్రాంతాల నుంచి పూర్తిగా వెనుకకు వెళ్ళిపోవాలని చైనాను భారత్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. 


చైనా మిలిటరీకి హై కమాండ్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధిపతి. 


Updated Date - 2020-08-15T02:47:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising