ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ భద్రత కోసం దేనికైనా సిద్ధం... పాకిస్థాన్‌కు తేల్చి చెప్పిన భారత్...

ABN, First Publish Date - 2020-11-21T20:26:07+05:30

దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని, ఉగ్రవాదంపై పోరాటంలో దేనికైనా సిద్ధమని పాకిస్థాన్‌కు భారత దేశం స్పష్టం చేసింది. ఇటీవల జమ్మూ-కశ్మీరులోని నగ్రోటాలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టి, భారీ దాడికి కుట్రను భగ్నం చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ సీనియర్ దౌత్యవేత్తను పిలిచి, ఉగ్రవాదాన్ని విడనాడాలని హితవు పలికింది. 


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోని ఛార్జ్ డీఅఫైర్స్ అఫ్తాబ్ హసన్ ఖాన్‌ను పిలిచింది. పాకిస్థాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు మద్దతిచ్చే విధానాలను విడనాడాలని డిమాండ్ చేసింది. ఇతర దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉగ్రవాద సంస్థలు పాక్ గడ్డపై ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదంపై పోరులో దేశ భద్రతను కాపాడుకోవడం కోసం తీసుకోవలసిన అన్ని చర్యలు తీసుకుంటామని గట్టిగా చెప్పింది. 


జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం ప్రధాని మోదీ స్పందిస్తూ భారత భద్రతా దళాలను ప్రశంసించారు. ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టడం ద్వారా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మన దేశంలో భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను భగ్నం చేశారని ప్రశంసించారు. 


మోదీ ప్రకటనపై పాకిస్థాన్ శుక్రవారం స్పందించింది. జమ్మూ-కశ్మీరులోని పరిస్థితి నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు భారత దేశం నైరాశ్యంతో ప్రయత్నిస్తోందని ఆరోపించింది. మోదీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి భారత దేశం మద్దతిస్తోందని ఆరోపించింది. ఉగ్రవాదానికి భారత్ మద్దతిస్తున్నట్లు తెలిపే నిఖార్సయిన సాక్ష్యాధారాలను పాకిస్థాన్ అందజేయడంతో, పాకిస్థాన్‌పై వ్యతిరేక ప్రచారాన్ని భారత్ ముమ్మరం చేసిందని ఆరోపించింది. ఉగ్రవాద చర్యల్లో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.


Updated Date - 2020-11-21T20:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising