ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటలీకి భారత్ మాస్క్‌లు, వైద్యపరికరాల సహాయం

ABN, First Publish Date - 2020-03-23T13:11:12+05:30

కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్న ఇటలీ దేశానికి భారతదేశం మాస్క్‌లు, వైద్యపరికరాలను సహాయంగా పంపించి ఆదుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్న ఇటలీ దేశానికి భారతదేశం మాస్క్‌లు, వైద్యపరికరాలను సహాయంగా పంపించి ఆదుకుంది. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో భారత్ మాస్క్‌లు, వైద్యపరికరాలు పంపించడాన్ని ఇటాలియన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్వాగతిస్తూ, ‘‘ఈ కష్టకాలంలో సహాయం చేసిన భారతదేశానికి మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అంటూ ఇటలీ విదేశాంగమంత్రిత్వశాఖ పేర్కొంది.


గతంలోనూ చైనా దేశంలోని వూహాన్ నగరంలో ఉన్న భారతీయులను తరలించడానికి చైనా వెళ్లిన భారతీయ వైమానిక దళానికి చెందిన సి-17 ప్రత్యేక విమానంలో 15 టన్నుల మాస్క్‌లు, చేతి తొడుగులు, వైద్యపరికరాలను భారత్ పంపించింది. దక్షిణాసియా దేశాలైన భూటాన్, మాల్దీవులకు కూడా భారత్ సహకారం అందించింది. సార్క్ కొవిడ్-19 వీడియో కాన్ఫరెన్స్ లో భారత సర్కారు కరోనా అత్యవసర నిధిని ప్రకటించింది. కరోనా విపత్తు సమయంలో ఏ సార్క్ దేశానికి అయినా సహాయం అందించేందుకు భారత్ సిద్ధమని ప్రకటించింది. కరోనా వైరస్ వల్ల ఇటలీ దేశంలో 4,825 మంది మరణించిన నేపథ్యంలో భారత్ ఆ దేశానికి సహాయం అందించింది. 

Updated Date - 2020-03-23T13:11:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising