మొబైల్ ఫోన్ల తయారీలో రెండో అతి పెద్ద దేశం భారత్!
ABN, First Publish Date - 2020-06-02T01:26:31+05:30
మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలో రెండో అతి పెద్ద దేశంగా అవతరించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ప్రకటించారు.
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలో రెండో అతి పెద్ద దేశంగా అవతరించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 300 పైచిలుకు మొబైల్ తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాని తెలిపారు. అంతే కాకుండా.. భారత్‌లో 33 కోట్ల ఫోన్లు తయారయ్యయని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన ఫోన్ల విలువ 3 బిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. ఒకప్పుడు ఫోన్ల దిగుమతి దారుగా ఉన్న భారత్ కేవలం ఐదేళ్లలో వీటిని ఎగుమతి చేసే స్థాయికి చేరిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రేపు మధ్యహ్నం 12.00 గంటలకు జరిగే పత్రికా సమావేశంలో మంత్రి రవి శంకర్ ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి మరిన్ని ప్రోత్సాహాకాలు, పథకాలు ప్రకటిస్తారని సమచారాం.
Updated Date - 2020-06-02T01:26:31+05:30 IST