ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్‌న్యూస్... భారత్‌లో తగ్గుతున్న కరోనా తీవ్రత

ABN, First Publish Date - 2020-11-03T15:39:28+05:30

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకూ తగ్గుముఖం పడుతుండటం కాస్తంత ఊరట కలిగించే విషయం. భారత్‌లో గతంతో పోల్చుకుంటే.. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య క్రమంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకూ తగ్గుముఖం పడుతుండటం కాస్తంత ఊరట కలిగించే విషయం. భారత్‌లో గతంతో పోల్చుకుంటే.. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. భారత్‌లో గత 24 గంటల్లో 38,310 కరోనా కేసులు, 490 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623కి చేరింది.


దేశంలో ప్రస్తుతం 5,41,405 యాక్టివ్‌ కేసులు ఉండగా, 76,03,121 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 1,23,097 మంది మృతి చెందారు. రికవరీ రేటు కూడా భారత్‌లో మెరుగ్గా ఉండటం విశేషం. సోమవారం ఒక్కరోజే 58,323 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 91.96 శాతంగా నమోదు కాగా.. మరణాల రేటు 1.49 శాతంగా ఉంది.



Updated Date - 2020-11-03T15:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising