ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆసియన్‌’తో అనుసంధానం పెంపునకు ప్రాధాన్యం:మోదీ

ABN, First Publish Date - 2020-11-13T08:49:51+05:30

ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియన్‌)తో అన్ని అంశాల్లో అనుసంధానం పెంపొందించుకోవడం భారత్‌కు అత్యంత ప్రధానమైన అంశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 12: ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియన్‌)తో అన్ని అంశాల్లో అనుసంధానం పెంపొందించుకోవడం భారత్‌కు అత్యంత ప్రధానమైన అంశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా డిజిటల్‌, సామాజిక, ఆర్థిక, ద్రవ్య, నౌక సంబంధమైన విషయాల్లో ఆసియన్‌ దేశాలతో దగ్గరయ్యామని చెప్పారు. భారత్‌, ఆసియన్‌ మధ్య గురువారం 17వ శిఖరాగ్ర సదస్సు వర్చువల్‌గా జరిగింది. భారత్‌-ఆసియన్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక పరమైన అంశాలే పునాది అని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. చైనాతో లద్ధాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండటం, ఆసియన్‌లోని కొన్ని దేశాలకు చైనా, దక్షిణ చైనా సముద్రంలో ప్రాదేశిక పరమైన వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది.  

Updated Date - 2020-11-13T08:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising