ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమ్మూ-కాశ్మీర్ మా అంతర్గత వ్యవహారం: చైనాకు భారత్ వార్నింగ్

ABN, First Publish Date - 2020-04-10T04:08:50+05:30

జమ్మూ-కాశ్మీర్‌కు సంబంధించి ఐరాసలో చైనా మాట్లాడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ-కాశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమని, అందులో ఎవరి జోక్యం అవసరం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్మూ-కాశ్మీర్‌కు సంబంధించి ఐరాసలో చైనా మాట్లాడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ-కాశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమని, అందులో ఎవరి జోక్యం అవసరం లేదని హెచ్చరించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ-కాశ్మీర్‌ ఇంతకుముందు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని, దీనిపై చైనాకు పూర్తి అవగాహన ఉందని, దానికి కట్టుబడి ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ  మంత్రిత్వ శాఖ చైనాకు సూచించింది. చైనా మాత్రమే కాదని, ఇతర దేశాలు ఏవైనా జమ్మూ-కాశ్మీర్  వ్యవహారంలో తలదూర్చినా సహించేది లేదని తేల్చి చెప్పింది. 

‘పక్కదేశాల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సరిహద్దుల విధానాలను గౌరవించడం అనేది చాలా అవసరం. భారతదేశం విషయంలో కూడా అన్ని దేశాలు దీనిని పాటించాలని మేము ఆశిస్తున్నామ’ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా భారత అంతరంగిక విషయాలపై కాకుండా ఉగ్రవాదాన్నిఅంతమొందించడం గురించి ఆలోచించాలని, ఒకదేశంలో నుంచి మరో దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులు చొరబడుతున్నారని, ఈ సమస్యను అధిగమించడంపై చైనా దృష్టి సారిస్తే బాగుంటుందని భారత్ సూచించింది.

Updated Date - 2020-04-10T04:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising