ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాంగాంగ్‌లోని 6 ప్రాంతాలు భారత్‌ వశం

ABN, First Publish Date - 2020-09-21T07:29:58+05:30

చైనాతో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ఆరు ప్రాంతాలను ముందు జాగ్రత్తగా భారత్‌ వశపరుచుకుంది. పాంగాంగ్‌ ప్రాంతంలోని ఫింగర్‌-4 సమీపంలో ఉన్న అవన్నీ భారత్‌లోని భూభాగాలే అయినప్పటికీ, ఖాళీగా ఉన్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గాల్లోకి చైనా బలగాల కాల్పులు


వాషింగ్టన్‌, సెప్టెంబరు 20: చైనాతో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ఆరు ప్రాంతాలను ముందు జాగ్రత్తగా భారత్‌ వశపరుచుకుంది. పాంగాంగ్‌ ప్రాంతంలోని ఫింగర్‌-4 సమీపంలో ఉన్న అవన్నీ భారత్‌లోని భూభాగాలే అయినప్పటికీ, ఖాళీగా ఉన్నాయి. చైనా అక్కడ తిష్ట వేసే అవకాశం ఉన్నందున ముందుగా భారత బలగాలు అక్కడకు చేరుకుని స్థావరాలు ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. తమ కుట్రను భారత్‌ భగ్నం చేసిందన్న అక్కసుతో చైనా సైనికులు కనీసం మూడు పర్యాయాలు గాల్లోకి కాల్పులు జరిపారని వెల్లడించాయి.


ఆరు ప్రాంతాల్లో మగర్‌ హిల్‌, గురుంగ్‌ హిల్‌, రెచెన్‌ లా, రెజాంగ్‌ లా, మోఖ్‌పరి ప్రాంతాలున్నాయి. వీటిలో రెచెన్‌ లా, రెజాంగ్‌ లా ప్రాంతాలకు సమీపంలో చైనా సుమారు 3వేలమంది అదనపు బలగాలను మోహరించిందని పేర్కొన్నాయి. దీంతో.. భారత్‌, చైనా సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. లద్దాఖ్‌ ప్రాంతంలో సు-30, ఎంకేఐ, జాగ్వార్‌, మిరేజ్‌ 2000 యుద్ధవిమానాల్ని భారత్‌ మోహరించిందని వార్తలు రావడంతో టిబెట్‌ అటానమస్‌ ప్రాంతం(టీఏఆర్‌)లో చైనా అప్రమత్తమైంది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక పీపుల్స్‌ డెయిలీ కథనాన్ని ప్రచురించింది. టిబెట్‌లోని లాసా నగరంలో వాయుదాడి జరిగితే ప్రజలు అప్రమత్తమయ్యేలా డ్రిల్స్‌ నిర్వహిస్తోందని తెలిపింది. లాసాలోని గొంగర్‌ విమానాశ్రయ మౌలిక వసతుల్ని చైనా భారీగా ఆధునీకీకరించిన నేపథ్యంలో భారత్‌ ఈ ఎయిర్‌ పోర్టుపై దాడి చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత్‌పై వేగంగా దాడి చేసేందుకు వీలుగా ఇక్కడే చైనా యుద్ధ విమానాలను మోహరిస్తోంది. కాగా.. రక్షణావసరాలకై సరిహద్దుల్లో భారత్‌ చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణాన్ని ఆపేందుకే చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోందని అమెరికా చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పేర్కొన్నారు. మౌలిక వసతుల్ని అడ్డుకోవడం ద్వారా చైనాకు వ్యూహాత్మకంగా లాభం చే కూరుతుందన్నారు. నిఘా వర్గాలకు సంబంధించి చట్టసభ సెలక్ట్‌ కమిటీలో కృష్ణమూర్తి మాత్రమే భారత సంతతి వ్యక్తి. చైనాతో వివాదాలున్న పొరు గు దేశాలన్నీ చేతులు కలపాల్సిన అవసరం ఉంద ని ఆయన అభిప్రాయపడ్డారు. సైనిక బలంతో అనుకున్నది సాధించడం కుదరదని ఈ దేశాలన్నీ చైనాకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2020-09-21T07:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising