ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత దేశానికి రక్షణ కావాలి, మూఢ నమ్మకాలు కాదు : కోల్‌కతా కాంగ్రెస్

ABN, First Publish Date - 2020-04-06T01:43:00+05:30

కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధం నేపథ్యంలో భారతీయులంతా సంఘీభావంతో దృఢ సంకల్పాన్ని తెలియజేసేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధం నేపథ్యంలో భారతీయులంతా సంఘీభావంతో దృఢ సంకల్పాన్ని తెలియజేసేందుకు దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును కోల్‌కతా కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతున్నారు. ఆదివారం వీరు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనల ప్రకారం ఒకరికొకరు దూరం పాటిస్తూ ఈ మౌన నిరసనలో పాల్గొన్నారు. 


భారత దేశానికి రక్షణ కావాలి కానీ, మూఢ నమ్మకాలు కాదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. కొవ్వొత్తులు, కరపత్రాలు పట్టుకుని వీరు వీథుల్లో మౌన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు శంకర్‌నాథ్ హజ్రా మాట్లాడుతూ తమకు మానవత్వం మీద నమ్మకం ఉందన్నారు. అష్ట దిగ్బంధనం నిబంధనలను తాము పాటిస్తున్నామన్నారు. ఒకరికొకరు నిబంధనల మేరకు దూరంగా ఉన్నామన్నారు. పేదలకు ఆహారం అందజేయాలనుకునేవారు పరస్పర దూరం పాటించాలన్నారు. తాము కొవ్వొత్తులను వెలిగించబోమని, అది మూఢ నమ్మకమని తెలిపారు. దీని పట్ల తాము నిరసన వ్యక్తం చేస్తామన్నారు. తాము కొవ్వొత్తులను ఎందుకు వెలిగించాలని ప్రశ్నించారు. వీటిని వెలిగించడం వల్ల తమకు ఒరిగేది ఏమిటని ప్రశ్నించారు. ఇది కోవిడ్-19కు పరిహారం కాదని చెప్పారు. 


Updated Date - 2020-04-06T01:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising