ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులుల సర్వేలో భారత్‌కు గిన్నిస్‌ రికార్డ్‌

ABN, First Publish Date - 2020-07-12T07:21:41+05:30

అక్షరాలా.. 3కోట్ల 48లక్షల 58వేల 623 ఫొటోలు.. వామ్మో! అన్ని ఫొటోలే! అనుకుంటున్నారా.. అవును.. పులుల గణనకు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలు తీసిన ఫొటోలు అవి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గణన కోసం 3కోట్ల 48లక్షల ఫొటోలు


న్యూఢిల్లీ, జూలై 11: అక్షరాలా.. 3కోట్ల 48లక్షల 58వేల 623 ఫొటోలు.. వామ్మో! అన్ని ఫొటోలే! అనుకుంటున్నారా.. అవును.. పులుల గణనకు  అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలు తీసిన ఫొటోలు అవి. ఫలితంగా.. పులుల సర్వే కోసం ప్రపంచంలోనే అధిక సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేసిన దేశంగా 2018 ఏడాదికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. మోషన్‌(చలన) సెన్సార్లు కలిగిన కెమెరాలను 26,838 ప్రదేశాల్లో.. 1,21,337 చదరపు కిలోమీటర్ల అటవీ పరిధిలో ఉంచారు. మొత్తం ఫొటోల్లో పులులకు సంబంధించినవి 76651, చిరుతలవి 5177 ఉండగా, మిగతావి వివిధ జంతువుల ఫొటోలు. ఇక, ఆ ఏడాది గణన ప్రకారం.. ప్రపంచంలోని పులుల సంఖ్యలో 75ు అంటే 2,967 మన దేశంలోనే ఉన్నాయి. డేటా, వనరుల వినియోగం వంటి అంశాల్లో ఇప్పటి వరకూ ఈ సర్వేనే సమగ్రమైనదని గిన్నిస్‌ రికార్డ్స్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. 


Updated Date - 2020-07-12T07:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising