ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ మాకు చాలా ముఖ్యమైన దేశం : యూఏఈ

ABN, First Publish Date - 2020-08-13T03:30:01+05:30

భారత దేశం తమకు చాలా ముఖ్యమైన దేశమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశం తమకు చాలా ముఖ్యమైన దేశమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఉమ్మడి లక్ష్యాలు, విలువలే ఆధారమని తెలిపింది. 


భారత దేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా బుధవారం వెబినార్‌లో మాట్లాడుతూ, భారత దేశం, యూఏఈ మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నాయని తెలిపారు. 


భారత దేశానికి యూఏఈ రాయబారిగా తాను గత నాలుగున్నరేళ్ళలో యూఏఈ, భారత దేశం మధ్య పటిష్టమైన వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను చూస్తున్నట్లు తెలిపారు. ఈ సంబంధాలు వివిధ రంగాల్లో వ్యూహాత్మకంగా మునుపెన్నడూ లేనంత మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. 


‘‘భారత దేశం మాకు చాలా ముఖ్యమైన దేశం. మా సంబంధాలు ఉమ్మడి లక్ష్యాలు, విలువలపై ఆధారపడి, సమష్టి చరిత్ర వారసత్వ భావంతో ఏర్పడ్డాయి. ఉమ్మడి విలువలు, సాంస్కృతిక అనుబంధం వల్ల సన్నిహితమయ్యాం’’ అని తెలిపారు. 


Updated Date - 2020-08-13T03:30:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising