ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ జీడీపీలో 6 శాతం కోత ఉంటుంది: బార్క్‌లే

ABN, First Publish Date - 2020-08-16T05:26:23+05:30

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీలో ఆరు శాతం మేర కోత పడుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బార్క్‌లే ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీలో ఆరు శాతం మేర కోత పడుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బార్క్‌లే ప్రకటించింది. గతంలో ఈ కోత 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేసిన సంస్థ తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఆ అంచనాను సవరించింది. కరోనా కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో జీడీపీ 25.5 శాతం మేర క్షీణిస్తుందని కూడా తెలిపింది. ఆ తరువాతి త్రైమాసికంలో ఈ కోత 8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండబోతోందని గతంలో అంచనా వేసిన బార్క్‌లే తాజాగా దాన్ని 7 శాతానికి కుదించింది. కరోనా కారణంగా భారత్‌తో పాటూ ప్రపంచంలో అనేక దేశాలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ కూడా మాంద్యంలోకి వెళ్లినట్టు అక్కడి ప్రభుత్వం ఇటీవలే అంగీకరించింది. 

Updated Date - 2020-08-16T05:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising