ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక దూరంతో 62% తగ్గుదల: ఐసీఎంఆర్‌

ABN, First Publish Date - 2020-03-25T07:35:35+05:30

సామాజిక దూరం నిబంధనను కఠినంగా అమలయ్యేలా చేస్తే భారత్‌లో కరోనా వ్యాప్తి కేసులను 62 శాతం తగ్గించవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 24: సామాజిక దూరం నిబంధనను కఠినంగా అమలయ్యేలా చేస్తే భారత్‌లో కరోనా వ్యాప్తి కేసులను 62 శాతం తగ్గించవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండడం వల్ల ఆ వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చని ఐసీఎంఆర్‌ సర్వేలో తేలింది. ఇలా చేయడం ద్వారా కరోనాను పూర్తిగా అరిక ట్టడానికి త్వరగా పలు ఆవిష్కరణలు చేసేలా శాస్త్రవేత్తలకు మరిన్ని అవకాశాలు ఇవ్వచ్చని పేర్కొంది. కాగా, కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించడానికి దేశంలోని 22 ప్రైవేటు ల్యాబరేటరీలు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)లో రిజిస్ట్రర్‌ చేసుకున్నాయి. ఈ ల్యాబరేటరీలన్నింటికీ దేశ వ్యాప్తంగా 15,500 కేంద్రాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. 118 ప్రభుత్వ ల్యాబరేటరీలు ఐసీఎంఆర్‌తో కలిసి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

Updated Date - 2020-03-25T07:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising