ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్ న్యూస్: జూలై 15లోగా భారత్‌లో 8 లక్షల కరోనా కేసులు..

ABN, First Publish Date - 2020-06-16T18:52:03+05:30

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. సగటున రోజుకు పదివేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3లక్షల 43వేల 91 కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. సగటున రోజుకు పదివేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3లక్షల 43వేల 91 కరోనా కేసులు నమోదయ్యాయి. 9915 మంది కరోనా భారిన పడి మరణించారు. లక్షా 80వేల 320 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో  కరోనా రికవరీ రేటు 51 శాతంగా ఉంది.. ఇదిలా ఉండగా తాజాగా విడుదలయిన ఓ సర్వే.. భారతీయులను మరింత భయాందోళనలకు గురిచేస్తోంది.. నెల రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలకు చేరకుంటుందని ఆ పరిశోధనలో స్పష్టమయింది..


భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు జనవరి 30న నమోదయింది. అప్పటి నుంచి జూన్ 15 వరకు.. 3లక్షల 43వేల 91 కరోనా కేసులు నమోదయ్యాయి. అంటే 138 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య దాదాపు మూడున్నర లక్షలకు చేరుకుంది. జూలై 15 లోగా భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఏకంగా 8లక్షలకు చేరుకుంటుందని మిచిగాన్ యూనివర్శిటీ ఓ అధ్యయనంలో తేల్చిచెప్పింది. జూలై 15 నాటికి ప్రపంచంలోనే కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో.. భారత్ మూడో స్థానంలో ఉంటుందని మిచిగాన్ యూనివర్శిటీ బయోస్టాటిస్టిక్స్  ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత్ ఉంటుందన్నారు. రాబోయే కొద్ది నెలల పాటు కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. 


ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఐదు దేశాల్లో.. కేసుల సంఖ్య ఇదీ..

అమెరికా: 21,82,950

బ్రెజిల్: 8,91,556

రష్యా: 5,45,458

భారత్: 3,43,091

యూకే: 2,96,857

Updated Date - 2020-06-16T18:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising