ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్-చైనా చర్చలు సఫలం... వెనక్కు తగ్గేందుకు అంగీకరించిన చైనా ఆర్మీ

ABN, First Publish Date - 2020-06-23T19:55:00+05:30

న్యూఢిల్లీ: భారత్-చైనా లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు సఫలమయ్యాయి. గల్వాన్‌లోని 14, 15, 17 పాయింట్లనుంచి తమ బలగాలను వెనక్కు తీసుకునేందుకు చైనా అంగీకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్-చైనా లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు సఫలమయ్యాయి. గల్వాన్‌లోని 14, 15, 17 పాయింట్లనుంచి తమ బలగాలను వెనక్కు తీసుకునేందుకు చైనా అంగీకరించింది. అదే సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ నాటి పరిస్థితి నెలకొనాలని భారత్ కోరింది. దీనికి కూడా చైనా అంగీకారం తెలిపినట్లు సమచారం. వాస్తవాధీన రేఖకు చైనా వైపున ఉన్న మోల్డోలో నిన్న 12 గంటల పాటు లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరపున లిన్ లియు చర్చల్లో పాల్గొన్నారు. చర్చలు మరోమారు జరిగే అవకాశం ఉంది. 


జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సందర్భంగా చైనా కుట్రపూరితంగా వ్వవహరించి భారత బలగాలపై పాశవికంగా దాడి చేసింది. కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. ఘటనలో పెద్ద సంఖ్యలో తమ జవాన్లు చనిపోయినా చైనా మాత్రం కిమ్మనడం లేదు. తమ కమాండర్ ఆఫీసర్ చనిపోయింది నిజమేనని అంగీకరించినా మరణాలపై క్లారిటీ ఇవ్వడం లేదు. చైనా బలగాల దాడిని ఎలాంటి ఆయుధాలు లేకుండా ఉత్త చేతులతో ఎదుర్కొన్న భారత జవాన్ల శక్తి సామర్థ్యాలు చూసి డ్రాగన్ కంట్రీలో వణుకు మొదలైందని కథనాలు వెలువడుతున్నాయి. పెద్ద సంఖ్యలో తమ జవాన్లు చనిపోవడంతో వెంటనే చర్చలకు పట్టుబట్టి మరీ నిన్న సుదీర్ఠంగా చర్చలు జరిపింది. 

Updated Date - 2020-06-23T19:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising