ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగిపోయిన దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేద్దాం : చైనాకు భారత్ పిలుపు

ABN, First Publish Date - 2020-08-15T02:00:58+05:30

వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి నిలిచిపోయిన దళాల ఉపసంహరణ ప్రక్రియను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి నిలిచిపోయిన దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడానికి కలిసి రావాలని చైనాకు భారత్ పిలుపు ఇచ్చింది. సరిహద్దుల్లో పరిస్థితులపైనే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. 


వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగాలను ఖాళీ చేసేందుకు చైనా నిరాసక్తత వ్యక్తం చేస్తోందని వార్తలు వస్తున్న సమయంలో, భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ భారత దేశ వైఖరిని వివరించారు. దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడానికి భారత్‌తో కలిసి రావాలని చైనాను కోరారు. 


ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడం కోసం ఇరు దేశాలు చాలా సమావేశాలు నిర్వహించాయి. కానీ పాంగాంగ్ సరస్సు డెప్సాంగ్ వంటి ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద చైనా దళాల ఉపసంహరణ నిలిచిపోయింది. 


వారానికోసారి నిర్వహించే మీడియా సమావేశంలో శ్రీవాస్తవ మాట్లాడుతూ, పూర్తి స్థాయిలో దళాల ఉపసంహరణ లక్ష్యం దిశగా నిజాయితీగా పని చేసేందుకు చైనా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ రిప్రజెంటేటివ్స్ అంగీకరించిన సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత పూర్తిగా పునరుద్ధరణ జరిగేందుకు, ఉద్రిక్తతలు తగ్గేందుకు కలిసి రావాలని కోరారు. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇది చాలా అవసరమని స్పష్టం చేశారు. 


Updated Date - 2020-08-15T02:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising