ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్, సింగపూర్ అధికారుల వర్చువల్ సమావేశం.. దౌత్య సంబంధాలపై చర్చ..

ABN, First Publish Date - 2020-12-11T05:22:57+05:30

భారత్, సింగపూర్ అధికారుల వర్చువల్ సమావేశం.. దౌత్య సంబంధాలపై చర్చ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్, సింగపూర్ దేశాలకు చెందిన సీనియర్ అధికారులు గురువారం వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు.. కరోనా అనంతరం అభివృద్ధిపైనా చర్చలు జరిపారు. విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీ (ఈస్ట్) రివా గంగూలీ, సింగపూర్ విదేశీ వ్యవహారాల సెకండ్ పర్మినెంట్ సెక్రటరీ స్టాన్లీ లోహ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏసియన్-భారత్ సంబంధాల పైనా ఈ సంరద్భంగా చర్చ జరిగింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఇంతకు ముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశం (ఏడీఎంఎం-ప్లస్)లో పాల్గొని వ్యూహాత్మక భద్రతా విధానంపై చర్చలు జరిపారు. బయోటెర్రరిజం, అంటువ్యాధుల ముప్పును పరిష్కరించేందుకు ఆసియా దేశాల రక్షణ మంత్రులు నిరంతర కృషి చేయాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-11T05:22:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising