ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభేదాలను భారత్-చైనా అధిగమించగలవు : ఎస్ జైశంకర్

ABN, First Publish Date - 2020-08-09T03:37:04+05:30

భారత్-చైనా మధ్య ఓ రకమైన సమతుల్యత, అవగాహన సాధించగలిగితే,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య ఓ రకమైన సమతుల్యత, అవగాహన సాధించగలిగితే, ఇరు దేశాలు తమ మధ్య విభేదాలను దీర్ఘకాలంలో అధిగమించగలవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం చెప్పారు. ఈ సమతుల్యతను సాధించడమే అతి పెద్ద సవాలు అని తెలిపారు. 


కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన ‘‘ఇండియా@75 సమ్మిట్ : మిషన్ 2022’’ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. భారత దేశం, చైనా రాబోయే దశాబ్దాల్లో స్నేహంగా మనగలుగుతాయా? అనే ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ, భారత్, చైనా పొరుగు దేశాలని చెప్పారు. జనాభాపరంగా కూడా ప్రత్యేకమైనవని చెప్పారు. ఇరు దేశాల్లోనూ 100 కోట్లకు పైగా జనాభా ఉందని చెప్పారు. చైనా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశమని, భారత దేశం మూడో స్థానం కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. అవి ఇబ్బందులుపడటానికి, అంతర్జాతీయ రాజకీయాల్లో బలంగా తిరిగి ఎదగడానికిమధ్య కాలం ఎక్కువేమీ కాదన్నారు. 


ఇరు దేశాలు సమాంతరంగా ఎదగడం చూస్తున్నామని, అయితే ఆ ఎదుగుదల విభిన్నంగా ఉందని చెప్పారు. ఇరు దేశాలు అవగాహనకు, సమతుల్యతకు రావలసిన అవసరం ఉందని తాను అభిప్రాయపడుతున్నానని తెలిపారు. దాన్ని ఎలా సాధించడం అనేదే ఇప్పుడు అతి పెద్ద సవాలు అని చెప్పారు. 


ఇరు దేశాల పరిమాణం, అవి చూపగలిగే ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని, వీటి మధ్య అవగాహన కుదరడంపై ప్రపంచం ఆధారపడినట్లు తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం సులువు కాదని, సమస్యలు సుస్పష్టంగా ఉన్నాయని తెలిపారు. మన విదేశాంగ విధానం లెక్కలకు ఇరు దేశాల మధ్య కుదిరే అవగాహన చాలా ముఖ్యమైనదని వివరించారు. జాతీయ, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వగలిగే, పోటీ నిండిన వాతావరణంలో దేశ లక్ష్యాలు, ఆకాంక్షలను పురోగమించేలా చేయగలిగే విదేశాంగ విధానమే సరైనదని చెప్పారు. శక్తి, సామర్థ్యాలను పటిష్టంగా, గాఢంగా, వేగంగా తీర్చిదిద్దడానికి చూపే నైపుణ్యం, చురుకుదనంపై అటువంటి విధానం ఆధారపడి ఉంటుందన్నారు. 


వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పెను సవాళ్లపై మన దేశం దీటుగా స్పందిస్తోందని చెప్పారు. పరస్పర ప్రయోజనాలను గుర్తిస్తూ, అత్యధిక దేశాలతో కలిసి పని చేస్తుండటం వల్ల దౌత్య రంగంలో మన దేశం విజయవంతమవుతున్నట్లు తెలిపారు. 


Updated Date - 2020-08-09T03:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising