ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనాతో 390 శాతం పెరిగిన బ‌యోమెడిక‌ల్ వేస్ట్‌... పేరుకున్న 12 వేల కిలోల చెత్త‌!

ABN, First Publish Date - 2020-07-14T11:44:26+05:30

యూపీలోని ఘజియాబాద్‌లో ఒక‌వైపు క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌గా, మ‌రోవైపు జిల్లాలో బయోమెడికల్ వ్యర్థాల పరిమాణం కూడా పెరిగిపోతోంది. వివిధ ఆసుపత్రుల నుంచి వెలువ‌డిన‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజియాబాద్: యూపీలోని ఘజియాబాద్‌లో ఒక‌వైపు క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌గా, మ‌రోవైపు జిల్లాలో బయోమెడికల్ వ్యర్థాల పరిమాణం కూడా పెరిగిపోతోంది. వివిధ ఆసుపత్రుల నుంచి వెలువ‌డిన‌ బయోమెడికల్ వ్యర్థాల పరిమాణం 390 శాతం మేర‌కు పెరిగింది. కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్‌లో బ‌యోమెడిక‌ల్ వ్య‌ర్థాలు 12,221 కిలోల‌కు చేరుకున్నాయి. గ‌తంలో జిల్లాలో నెలకు సుమారు 1100 కిలోల బయోమెడికల్ వ్యర్థాలు మాత్రమే విడుదలయ్యేవి. ఈ సంద‌ర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ఉత్సవ్ శర్మ మాట్లాడుతూ కరోనా ఇన్ఫెక్షన్ సమయంలో బయోమెడికల్ వ్యర్థాల పరిమాణం మ‌రింత‌గా పెరుగుతున్న‌ద‌న్నారు. భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా కొన‌సాగే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఘజియాబాద్ జిల్లాలో బయోవెస్ట్‌ను పారవేసేందుకు రెండు బయోవేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఉన్నాయ‌న్నారు. వీటిని ప‌రిపాల‌నా యంత్రాంగం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని అన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి, ఇంక్యుబేటర్ యంత్రంతో బయో వ్యర్థాలను పారవేయడం పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న‌ద‌ని తెలిపారు. 

Updated Date - 2020-07-14T11:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising