ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5 రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు..

ABN, First Publish Date - 2020-04-03T23:00:55+05:30

కేంద్రం కోవిడ్-19పై పోరాటానికి రక్షణాత్మక చర్యలు ప్రకటిస్తున్నా, రాష్ట్రాలు ప్రత్యేక సూచనలతో ముందుకు వెళ్తున్నా కరోనా విస్తరణ కేసులు ఇండియాలో రోజురోజుకూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్రం కోవిడ్-19పై పోరాటానికి రక్షణాత్మక చర్యలు ప్రకటిస్తున్నా, రాష్ట్రాలు ప్రత్యేక సూచనలతో ముందుకు వెళ్తున్నా కరోనా విస్తరణ కేసులు ఇండియాలో రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు రాలేదని కేంద్రం ప్రకటిస్తున్నా, కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.


కొద్ది రోజుల గణాంకాలను పరిశీలిస్తే, మార్చి 10 నుంచి 20 వరకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు 50 నుంచి 196కి చేరుకున్నారు. మార్చి 25 నాటికి కేసుల సంఖ్య 606కు చేరుగా, మార్చి 31 నాటికి 1397 కేసులు నమోదయ్యాయి. నిజానికి ఐదు రోజులనేది చాలా సుదీర్ఘ సమయం ఏమీ కానప్పటికీ, అదే ఐదు రోజుల్లో కోవిడ్-19 నమోదు కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం ఒకింత ఆందోళన కలిగించే విషయమని గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 29 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ కోవిడ్-19 కేసులు 1,024 నుంచి 2,069కి చేరుకున్నాయి. అంటే ఐదు రోజుల్లో రెట్టింపుకు పైగా కేసులు నమోదైనట్టు లెక్క. కాగా, రాబోయే ఐదు రోజులు మరింత కీలకమని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-03T23:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising