ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు

ABN, First Publish Date - 2020-08-12T15:32:22+05:30

పలు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ కేంద్రం బుధవారం హెచ్చరించింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ కేంద్రం బుధవారం హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. కురుక్షేత్ర, యమునానగర్, షామ్లీ, కర్నాల్, రూర్కీ, ఖాటౌలీ, హస్తినాపూర్, చాంద్ పూర్, నజిబాబాద్, బిజ్నూర్, అమ్రోహ, మొరాదాబాద్, ఆగ్రా, మధుర, ముజఫ్ఫర్ నగర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్ ప్రాంతాల్లో బుధవారం వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో బుధ, గురువారాల్లో వర్షాలు కురవవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో వర్షాలు కురవవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

Updated Date - 2020-08-12T15:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising