ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనిమిది తర్వాత... జాగ్రత్త లేకుంటే...

ABN, First Publish Date - 2020-06-05T19:24:07+05:30

రానున్న రోజుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగే ప్రమాదముందన్న ఆందోళన పెరిగిపోతోంది. లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత దేశంలో కరోనా వ్యాప్తి రేటు గణనీయంగా పెరిగింది. ప్రజా రవాణాను అనుమతించడం, దుకాణాలను తెరవడం, ప్రజల కదలికలపై ఆంక్షలు ఎత్తివేయడం... తదితర పరిణామాల నేపధ్యంలో భారత్‌లో కరోనా సామాజిక వ్యాప్తి దశకు వస్తున్నట్టు భావిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రానున్న రోజుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగే ప్రమాదముందన్న  ఆందోళన పెరిగిపోతోంది. లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత దేశంలో కరోనా వ్యాప్తి రేటు గణనీయంగా పెరిగింది. ప్రజా రవాణాను అనుమతించడం, దుకాణాలను తెరవడం, ప్రజల కదలికలపై ఆంక్షలు ఎత్తివేయడం... తదితర పరిణామాల నేపధ్యంలో భారత్‌లో కరోనా సామాజిక వ్యాప్తి దశకు వస్తున్నట్టు భావిస్తున్నారు.


ఈ క్రమంలోనే... లాక్‌డౌన్ సడలింపులపై ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు వినవస్తోంది. గతంలో కూడా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు అనుమతులిచ్చినట్టే ఇచ్చి, వెంటనే కరోనా భయంతో వాటిని నిలిపివేసింది కేంద్రం. లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసి, ఇప్పుడు చేతులెత్తేసిందని ఈపాటికే కేంద్రం అప్రతిష్టను తలకెత్తుకుంది. 


ఈ నేపథ్యంలో మరో సాహసానికి కేంద్రం పూనుకుంటుందా ? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో... ఈ నెల 8 వ తేదీ నుంచి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2020-06-05T19:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising