ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు మలేరియా మందు! ఓకే అన్న ఐసీఎమ్ఆర్

ABN, First Publish Date - 2020-03-24T00:09:02+05:30

కరోనా వైరస్ వల్ల అత్యధిక ప్రమాదం ఎదుర్కొంటున్న హై రిస్క్ వ్యక్తుల కోసం మలేరియా మందు.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగించవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల అత్యధిక ప్రమాదం ఎదుర్కొంటున్న హై రిస్క్ వ్యక్తులను వైరస్ బారిన పడకుండా రక్షించేందుకు మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగించవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ప్రకటించింది. కరోనా అనుమానితులు, బాధితులకు వైద్య సేవలు అందించే వారు కరోనా బారిన పడకుండా ఈ ఔషధం తీసుకోవాలని సూచించింది. అదే విధంగా.. కరోనా పాజిటివ్ వ్యక్తుల కుటుంబీకులకు కూడా ముందు జాగ్రత్త చర్యగా ఈ ఔషధం ఇవ్వచ్చని తెలిపింది. కరోనాకు మందు లేని నేపథ్యంలో ఈ మలేరియా నిరోధక ఔషధంపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు కొత్త ఔషధం కనిపెట్టే బదులు అందుబాటులో ఉన్న ఔషధాల్లోనే ఏది మంచి ఫలితాల్ని ఇస్తోందో తెలుసుకునేందుకు పరిశధకులు స్టడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రాక్సీక్లోరోక్విన్ తెరపైకి వచ్చింది. దీనికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్‌ గురించి శాస్త్రవేత్తలకు ఎప్పుడో తెలుసు. ప్రస్తుతం ఇవే సైడ్ ఎఫెక్ట్స్.. కరోనా పనిబట్టే ఆయుధాలుగా మారాయి. 

Updated Date - 2020-03-24T00:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising