ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య ఉద్యోగులకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు... ఐసీఎంఆర్ ఆమోదం

ABN, First Publish Date - 2020-05-23T16:55:10+05:30

హైడ్రాక్సీ క్వోరోక్విన్ మాత్రలు తీసుకుంటే కొవిడ్-19 వైరస్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కనుగొంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  హైడ్రాక్సీ క్వోరోక్విన్ మాత్రలు తీసుకుంటే కొవిడ్-19 వైరస్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తుందని ఇండియన్  కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కనుగొంది. కరోనా వైరస్ నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఉపయోగపడతాయని ఐసీఎంఆర్ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. కానీ కరోనా రోగుల్లో ఈ మాత్రలు తీసుకోవడం వల్ల గుండెకు ముప్పు పెరుగుతుందని వెల్లడైంది. దేశంలో కరోనాపై పోరాడుతున్న ఆరోగ్య శాఖ కార్యకర్తలు, వైద్యులు కరోనా బారినపడకుండా వారి రోగనిరోధక శక్తి పెంచేందుకు హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లె్లను వాడాలని ఐసీఎంఆర్ సిఫారసు చేసింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో 334 మంది ఆరోగ్యకార్యకర్తలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను ఆరు వారాల పాటు తీసుకోగా, వారిలో కరోనా సంక్రమణ తక్కువగా ఉందని తేలింది. కొవిడ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఆరోగ్యశాఖ కార్యకర్తలు, వైద్యులకు కరోనా సోకకుండా ముందుజాగ్రత్త చర్యగా హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు అందించాలని ఐసీఎంఆర్ సిఫారసు చేసింది. ఆరోగ్య కార్యకర్తలే కాకుండా కంటైన్మెంటు జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న పారామిలటరీ, పోలీసు, మున్సిపల్ కార్మికులు కరోనా రాకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. 

Updated Date - 2020-05-23T16:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising