ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.4వేల కోట్ల స్కాంలో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-06-24T04:21:47+05:30

కర్ణాటకలో 2019లో సంచలనం రేకెత్తించిన ఐఎంఏ స్కాంలో చిక్కుకున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటకలో 2019లో సంచలనం రేకెత్తించిన ఐఎంఏ స్కాంలో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలో ఆయన విగత జీవిగా పడి ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఐఎంఏ స్కాంలో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి కోటిన్నర లంచం తీసుకుని అతనికి క్లీన్ చీట్ ఇచ్చారనేది విజయ్ శంకర్ పై సీబీఐ చేసిన ప్రధాన అభియోగం. ఈ కేసులో విజయ్ శంకర్ తో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు రెండు వారాల క్రితం కర్ణాటక ప్రభుత్వం సీబీఐకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ శంకర్ ఆత్మహత్య కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది.


భారీ వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపి కర్ణాటకలో రూ.4 వేల కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో సేకరించి ఐఎంఏ జ్యూవెలర్స్ బోర్డు తిప్పేసింది. దాదాపు 50 వేల మంది డిపాజిటర్లు ఈ సంస్థపై, సంస్థ యజమాని మన్సూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో ఈ కేసు సంచలనానికి దారి తీసింది.

Updated Date - 2020-06-24T04:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising