ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి వార్తలు చదువుతా: రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2020-07-14T01:09:37+05:30

ఇండియాలోని న్యూస్ ఛానల్స్ అన్నీ మోదీకి సరెండర్ అయ్యాయని, దేశ ప్రజల అవసరాల గురించి అవి పట్టించుకోవడం లేదని కొంత కాలంగా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్న రాహుల్ గాంధీ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా పాత్ర తానే పోషించబోతున్నట్లు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేపటి నుంచి వార్తలు చదువుతారట. అది ఏ న్యూస్ ఛానల్ రూంలో కూర్చొని కాదు లెండి, తన సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోల ద్వారానట. ఇండియన్ మీడియాపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాహుల్ గాంధీ.. వీడియో సందేశాల ద్వారా వాస్తవాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఇండియాలోని న్యూస్ ఛానల్స్ అన్నీ మోదీకి సరెండర్ అయ్యాయని, దేశ ప్రజల అవసరాల గురించి అవి పట్టించుకోవడం లేదని కొంత కాలంగా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్న రాహుల్ గాంధీ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా పాత్ర తానే పోషించబోతున్నట్లు ప్రకటించారు.


‘‘నేడు ఇండియన్ మీడియా ఎక్కువ భాగం ఫాసిస్ట్ ప్రయోజనాలను అనుకూలంగా ప్రచారం చేయడానికే పని చేస్తోంది. టెలివిజన్ ఛానల్స్, వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌ల ద్వారా తప్పుడు, ధ్వేషపూరిత కథనాలను వ్యాప్తి చేస్తున్నారు. ఈ అబద్ధాలు దేశాన్ని ముక్కలు చేస్తున్నాయి. అందుకే దేశ ప్రజలకు నేనే వాస్తవాలను అందించాలని నిర్ణయించుకున్నాను. రేపటి నుంచి కరెంట్ ఎఫైర్స్, చరిత్ర, సంక్షోభాల గురించి వీడియో సందేశాల ద్వారా నా అభిప్రాయాల్ని వ్యక్త పరుస్తాను.’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

Updated Date - 2020-07-14T01:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising