పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తా: ఢిల్లీలోని స్లమ్స్‌కు కేజ్రివాల్ హామీ
ABN, First Publish Date - 2020-09-15T02:16:37+05:30
ఢిల్లీలో రైల్వే ట్రాక్‌ల వెంట ఉన్న మురికివాడలను సెఫ్టీ జోన్ నుంచి మూడు నెలల్లోగా తొలగించాలని ఆగస్టు 31న రైల్వేకు సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలగింపు ప్రక్రియపై ఢిల్లీలోని ఏ కోర్టు కూడా స్టే ఇవ్వకూడదని చెప్పింది
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం దేశ రాజధానిలో 48,000 మురికి వాడల్ని తొలగించక తప్పదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. అయితే ఇందులో ఇళ్లు కల్పోయిన ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైల్వే ట్రాక్‌ల వెంట ఉన్న మురికివాడలను అప్పుడే తొలగించబోమని కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టుకు తెలిపింది. అనంతరం కూల్చక తప్పదని కేజ్రివాల్ తేల్చి చెప్పారు. అయితే నివాసం కోల్పోతున్న 2.4 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఢిల్లీలో రైల్వే ట్రాక్‌ల వెంట ఉన్న మురికివాడలను సెఫ్టీ జోన్ నుంచి మూడు నెలల్లోగా తొలగించాలని ఆగస్టు 31న రైల్వేకు సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలగింపు ప్రక్రియపై ఢిల్లీలోని ఏ కోర్టు కూడా స్టే ఇవ్వకూడదని చెప్పింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్, 11 మురికివాడలకు చెందిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రత్యామ్నాయ ఇండ్లను సమకూర్చేవరకు 2.4 లక్షల మంది మురికివాడ నివాసితులను ఖాళీ చేయించవద్దని కోర్టును కోరారు.
Updated Date - 2020-09-15T02:16:37+05:30 IST