ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయం కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే చెప్పాను: సింధియా

ABN, First Publish Date - 2020-10-19T00:52:07+05:30

మధ్యప్రదేశ్‌లోని అగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. కాంగ్రెస్ నేతలతో ఒక మాట చెప్పాను. ఆర్టికల్ 370 రద్దును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక అధికారాల్ని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేయడంపై తాను ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే ఆ పార్టీ నేతలకు చెప్పానని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అంతే కాకుండా రామమందిర నిర్మాణానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది రాయి వేశారనే విషయాన్ని ఆయన తప్పు పట్టారు. రామమందిరానికి తొలి పునాది రాయి వేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని అన్నారు.


మధ్యప్రదేశ్‌లోని అగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. కాంగ్రెస్ నేతలతో ఒక మాట చెప్పాను. ఆర్టికల్ 370 రద్దును నేను సమర్ధిస్తాను అన్నాను. వారు నాతో ఏకీభవించలేదు. అయినప్పటికీ నేను సమర్ధించాలనే నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఇది పార్టీలు తీసుకునే నిర్ణయం కాదు, దీనిపై ప్రజలే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అది వారి ఆశ. ఇక కాంగ్రెస్ వారు చెబుతున్నట్లు రామమందిరానికి పునాది రాయి వేసింది మాజీ ప్రధాని కాదు, ప్రస్తుత ప్రధాని. మోదీనే రామమందిరానికి తొలి పునాది రాయి వేశారు’’ అన్నారు.

Updated Date - 2020-10-19T00:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising