ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా పెళ్లికి హైదరాబాద్‌ రాలేను..

ABN, First Publish Date - 2020-09-14T06:55:35+05:30

కరోనా వైర్‌సపై పోరులో ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా ఉన్న తాను నిర్వహిస్తున్న విధులకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో పెళ్లి కోసం సెలవు పెట్టేందుకు ఇష్టపడని ఐఏఎస్‌ అధికారిణి కాఛార్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కీర్తి జల్లి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుడిని తన వద్దకు  రప్పించి 

తాళి కట్టించుకున్న మహిళా ఐఏఎస్‌ 


గువహాటి, సెప్టెంబరు 13: కరోనా వైర్‌సపై పోరులో ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా ఉన్న తాను నిర్వహిస్తున్న విధులకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో పెళ్లి కోసం సెలవు పెట్టేందుకు ఇష్టపడని ఐఏఎస్‌ అధికారిణి కాఛార్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కీర్తి జల్లి.. వరుడినే తాను ఉంటున్న చోటుకు పిలిపించుకొని తాళి కట్టించుకున్నారు. విఽఽధి నిర్వహణే ప్రధానమని చాటుకున్నారు.కీర్తి వివాహాన్ని హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించారు. అయితే తన అధికార బాధ్యతల వల్ల తాను హైదరాబాద్‌కు రాలేనని చెప్పడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆశ్చర్యపోయారు.


తాను హైదరాబాద్‌కు వచ్చే బదులు, కాఛార్‌లోని తన అధికార నివాసానికి వరుడే వస్తే బాగుంటుందని, బుధవారం అసోంలో ప్రభుత్వ సెలవు అని, ఆ రోజు పెళ్లి చేసుకోవచ్చునని ప్రతిపాదించారు. వరుడు ఆదిత్య శశికాంత్‌ పుణె నుంచి కాఛార్‌లోని కీర్తి నివాసానికి చేరుకున్నారు.


30లోపు అతిథిగణం మధ్య బుధవారం పెళ్లి జరిగింది. కీర్తి తరఫున ఆమె సోదరి మాత్రమే హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులకు కరోనా సోకడంతో వారు రాలేకపోయారు. పెళ్లి సమయంలో కూడా విధులు నిర్వహిస్తూనే ఆమె కనిపించారు.


Updated Date - 2020-09-14T06:55:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising