ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా’ క్రెడిట్ మీరెలా తీసుకుంటారు.. కేజ్రీవాల్‌పై గంభీర్ ఫైర్..

ABN, First Publish Date - 2020-07-12T03:21:39+05:30

దేశ రాజధాని ఢిల్లీ కరోనా నుంచి కొద్దికొద్దిగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నమోదవుతున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోనా నుంచి కొద్దికొద్దిగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నమోదవుతున్న కేసులు కూడా క్రమేపీ తగ్గుతున్నాయి. దీంతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రెడిట్ మొత్తాన్ని కేజ్రీవాల్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ మండిపడ్డారు. టీవీల్లో తనకు పేరు, ప్రఖ్యాతులపై ఎటువంటి ఆపేక్ష లేదని చెప్పే తుగ్లగ్ కేజ్రీవాల్, ఇప్పుడు గంట గంటకూ కరోనా పరిస్థితులపై ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు. దీని ద్వారా కరోనా విషయంలో ఢిల్లీ సాధించిన ప్రగతి మొత్తాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. జూలై ఆఖరు లోపు 5.5 లక్షల కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవుతాయంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే కాకుండా కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు కూడా కేజ్రీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై కేజ్రీవాల్ తిరుగులేని పోరాటం చేస్తున్నట్లు, ఇదంతా కేజ్రీవాల్ మహిమే అన్నట్లు ఆప్ ప్రభుత్వం ట్విటర్‌లో ఊదరగొడుతోందని, అయితే దీనిపై ముఖ్యమంత్రితో పాటు, పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని నిప్పులు చెరిగారు.

Updated Date - 2020-07-12T03:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising