ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాంకాంగ్ ఉద్యమకారుడు వాంగ్ అరెస్ట్

ABN, First Publish Date - 2020-09-24T22:12:31+05:30

హాంకాంగ్‌ ప్రజాస్వామ్యవాది, ఉద్యమకారుడు జాషువా వాంగ్‌ను అధికారులు ఇవాళ మరోసారి అరెస్ట్ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాంకాంగ్: హాంకాంగ్‌ ప్రజాస్వామ్యవాది, ఉద్యమకారుడు జాషువా వాంగ్‌ను అధికారులు ఇవాళ మరోసారి అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో ఆయన అనధికారిక సమావేశం నిర్వహించారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాను అరెస్ట్ అయిన విషయాన్ని వాంగ్ స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో తనను ఉంచినట్టు వాంగ్ తెలిపారు. కరోనా సంక్షోభానికి ముందు ప్రజలు తమ గుర్తింపు తెలియకుండా మాస్కులు ధరించడాన్ని నిషేధించే చట్టాన్ని కూడా తనపై ప్రయోగించినట్టు వాంగ్ పేర్కొన్నారు.  2014లో అంబ్రెల్లా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్న వాంగ్ అనతికాలంలోనే క్రియాశీలక ఉద్యమకారుడి అవతారమెత్తాడు.


అయితే ఉద్యమ కారుల గొంతునొక్కేందుకు చైనా ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం తీసుకొచ్చిన తర్వాత వాంగ్ సహా పెద్ద సంఖ్యలో నేతలు అరెస్ట్ అవుతున్నారు.  గతేడాది ఏ ఒక్క నాయకుడు కూడా లేకుండానే ఉద్యమం ఊపందుకోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఘర్షణలకు దిగడం వెనుక వాంగ్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే హాంకాంగ్‌లో చైనా జాతీయ భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. చైనా అండతో ఇప్పుడు హాంకాంగ్ అధికారులు కీలక ప్రతిపక్ష నేతలపై అనధికారిక సమావేశాలు, చట్టం ఉల్లంఘన సహా పలు అభియోగాలు మోపి నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. 

Updated Date - 2020-09-24T22:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising