ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిజ్బుల్ ఉగ్రవాది హిదయతుల్లాదే ఆ కారు: పుల్వామా కుట్ర కేసులో పురోగతి

ABN, First Publish Date - 2020-05-29T18:52:03+05:30

శ్రీనగర్: పుల్వామాలో భారీ పేలుడు పదార్ధాలు నింపి కారుతో దాడికి యత్నించిన కుట్ర కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: పుల్వామాలో భారీ పేలుడు పదార్ధాలు నింపి కారుతో దాడికి యత్నించిన కుట్ర కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు పురోగతి సాధించారు. కారు ఓనర్‌ను షోపియాన్‌కు చెందిన ఉగ్రవాది హిదయతుల్లా మలిక్‌గా గుర్తించారు. ఇతడు 2019 జులై నుంచి హిజ్బుల్ ఉగ్రవాద సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. పోలీసులు హిదయతుల్లా సోదరుడు సమీర్‌ను అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో అనేక కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. హిదయతుల్లా సోదరుడు సమీర్ ఇచ్చిన సమాచారం మేరకు అనేక చోట్ల పోలీసులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 


పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14 తరహాలో దాడి జరిపేందుకు నిన్న ఉగ్రవాదులు యత్నించారు. ఈ కుట్రను జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్ జవాన్లు చిత్తు చేశారు. పేలుడు పదార్ధాలున్న కారును వెంబడించారు. కాల్పులు కూడా జరపడంతో ఉగ్రవాదులు కారు వదిలి పారిపోయారు. కారులో లభించిన ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాస్తవానికి కారుకు అమర్చిన నేమ్ ప్లేట్ టూ వీలర్స్‌దిగా గుర్తించారు. పోలీసులకు లభించిన ఆధారాలు హిదయతుల్లా ఇంటికి చేర్చాయి. ఆ తర్వాత దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడికి హిజ్బుల్ ముజాహిదీన్, జైష్ ఎ మహహ్మద్ కుట్ర పన్నినట్లు గుర్తించారు. 

Updated Date - 2020-05-29T18:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising