ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అష్ట దిగ్బంధనం తర్వాత చర్యల కోసం 10 కమిటీలు

ABN, First Publish Date - 2020-03-30T02:25:29+05:30

కరోనా వైరస్ మహమ్మారి వేధింపుల నిరోధం లక్ష్యంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం పూర్తయ్యాక అన్ని రంగాల్లో తిరిగి నూతనోత్తేజం నింపేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి వేధింపుల నిరోధం లక్ష్యంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం పూర్తయ్యాక అన్ని రంగాల్లో తిరిగి నూతనోత్తేజం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వ్యవస్థ, ప్రజల సమస్యలు వంటి 10 రంగాలకు ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీలను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదివారం ఏర్పాటు చేసింది. 


21 రోజుల అష్ట దిగ్బంధనం ముగిసిన తర్వాత సాధ్యమైనంత వేగంగా అన్ని పరిస్థితులను చక్కదిద్దడానికి తగిన సలహాలు ఇచ్చేందుకు ఈ ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ పీ.కే. మిశ్రా మార్గదర్శకత్వంలో పని చేస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన అత్యవసర పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. 


ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వ్యవస్థ వంటి రంగాలు అతి తక్కువ కాలంలో సాధారణ స్థితికి తిరిగి రావడానికి అవసరమైన వ్యూహాలను ఈ కమిటీలు రూపొందిస్తాయి. ప్రతి కమిటీ తనకు పీఎంఓ అప్పగించిన రంగంపై అధ్యయనం చేసి, సలహాలు ఇస్తుంది. 


ఆర్థిక వ్యవస్థ, సంక్షేమంపై కమిటీని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అటను చక్రవర్తి నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ అంశాలపై ఈ కమిటీ సలహాలు, వ్యూహాలు అందజేస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా ఈ కమిటీ పని చేస్తుంది. 


మరీ ముఖ్యంగా పేదలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంపై ఈ కమిటీ సలహాలిస్తుందని సమాచారం.


Updated Date - 2020-03-30T02:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising