ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికాస్ దూబే ఎన్‌కౌంటర్ ఇలా జరిగింది...

ABN, First Publish Date - 2020-07-10T14:37:47+05:30

కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోలీసు నుంచి తుపాకీ లాక్కోని పారిపోతుండగా తాము జరిపిన కాల్పుల్లో మరణించాడని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెప్పారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్ : కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోలీసు నుంచి తుపాకీ లాక్కోని పారిపోతుండగా తాము జరిపిన కాల్పుల్లో మరణించాడని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెప్పారు. దూబే ఎన్‌కౌంటర్ ఘటనపై యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వికాస్ దూబే ఎన్‌కౌంటర్ జరిగిన క్రమాన్ని ఐజీ మోహిత్ అగర్వాల్ వివరించారు. 

సమయం : ఉదయం 7.00 గంటలు...యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ 13 కార్ల కాన్వాయ్ తో భారీ సాయుధ భద్రత మధ్య గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ నగర సమీపంలోని బర్రా వద్దకు తీసుకువచ్చారు. అప్పుడు దూబే ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. 

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఓ పోలీసు కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొని పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు యత్నించాడు.

యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ దూబేను లొంగిపోవాలని కోరారు...

అయినా పోలీసుల మాట వినకుండా దూబే పారిపోయేందుకు యత్నిస్తుండగా, ఆత్మరక్షణ కోసం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కాల్పులు జరిపింది. 

యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన కాల్పుల్లో వికాస్ దూబే మరణించాడు.

Updated Date - 2020-07-10T14:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising