ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ, ముంబైలో ఏకధాటిగా వర్షం

ABN, First Publish Date - 2020-08-14T06:46:40+05:30

దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ వణుకుతోంది. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 10.69 సెం.మీ. వర్షపాతం నమోదైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ వణుకుతోంది.  24 గంటల వ్యవధిలో అత్యధికంగా 10.69 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కొన్ని రోడ్లపై నడుము లోతు వరకు నీరు నిలిచిపోయింది. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు ఢిల్లీలో సాధారణం కన్నా 7 శాతం అధిక వర్షపాతం నమోదైంది.


ముంబైలో పలు ప్రాంతాల్లో 7-10 సెం.మీ. వర్షం కురిసింది.  కేరళలో వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. రాగల రెండు మూడు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్‌ మధ్య.. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి నైరుతి రుతుపవనాలతో పాటు అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న తేమ గాలుల ప్రభావం తోడవడంతో.. భారీ వర్షాలకు అవకాశం ఏర్పడిందని తెలిపింది.  


Updated Date - 2020-08-14T06:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising