మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు..
ABN, First Publish Date - 2020-11-13T14:05:23+05:30
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు భారీగా వర్షాలు
చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారి పువియరసన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సముద్రతీర జిల్లాల్లో, డెల్టా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయని, బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని, ఆ కారణంగా రాష్ట్రమంతటా రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, రానున్న 24 గంటల్లో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీగా వర్షాలు కురుస్తాయని ఆయన తెలియజేశారు.
ఈనెల 15న రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, దీపావళి రోజున కూడా చెన్నై సహా నాలుగు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. గురువారం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం, మండపం ప్రాంతాల్లో 3 సెం.మీ., నుంగంబాక్కం, ఎన్నూరు, మైలాడుతురై, ఆలందూరు, చెన్నై విమానాశ్రయం ప్రాంతాల్లో తలా 2 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు, తిరుచెందూరులో ఒక సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు ఆయన వివరించారు.
Updated Date - 2020-11-13T14:05:23+05:30 IST