ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ABN, First Publish Date - 2020-06-06T16:02:26+05:30

రాగల రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్రతోపాటు యానాం, కేరళ, మహారాష్ట్ర, కొంకణ్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

థానే (మహారాష్ట్ర): రాగల రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్రతోపాటు యానాం, కేరళ, మహారాష్ట్ర, కొంకణ్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ‘నిసర్గ’ తుపాన్ ప్రభావం అనంతరం మహారాష్ట్రలోని సముద్రతీర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాల వల్ల థానే నగరంలోని పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. థానే నగరంలోని పలు జంక్షన్లలో వరదనీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. అరేబియా సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణకేంద్రం అధికారులు చెప్పారు. ఉత్తర అండమాన్ సముద్ర తీరంతోపాటు కేంద్ర బంగాళాఖాతం తీరాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణకేంద్రం అధికారులు హెచ్చరించారు. గాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణకేంద్రం అధికారులు సూచించారు. 

Updated Date - 2020-06-06T16:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising